🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 07 Jul, 2026 | Page: 1

బీబీనగర్ పీఏసీఎస్‌కు కొత్త పీఐసీ కమిటీ

బీబీనగర్, జూలై 07 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్సన్-ఇన్-చార్జ్ (పీఐసీ) కమిటీని నియమించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ జీఓ ఆర్‌టీ నెం.382ను గ‌డిచిన‌ సోమవారం జారీ చేసింది. కొత్త కమిటీ ఆరు నెలల పాటు లేదా పీఏసీఎస్ ఎన్నికలు నిర్వహించే వరకు, ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. సహకార సంఘం నిర్వహణలో గుర్తించిన పరిపాలనా లోపాలు, ఆడిట్ అభ్యంతరాల పరిష్కారంలో జాప్యం, రుణాల వసూళ్లలో నిర్లక్ష్యం, బకాయిల పెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేక కమిషనర్ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
🏠 Home