ఘనంగా టీజీ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం - దేవరకొండలో జెండా ఆవిష్కరణ
దేవరకొండ 07జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీజీ ఎమ్మార్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మేడి పాపన్న గారి ఆదేశాల మేరకు దేవరకొండలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ రెండో వార్డులో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు కోతేం సహదేవులు మాట్లాడుతూ, "సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎమ్మార్పీఎస్ నిరంతరం పోరాడుతోంది. ఈ ఉద్యమ స్ఫూర్తిని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లి, సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పొట్ట ప్రభు, గుడిపల్లి అధ్యక్షులు గిరి, మండల అధ్యక్షులు గిరి, చందంపేట నాయకులు హరికృష్ణ, నేరేడుగొమ్ము నాయకులు నగేష్, ఎం ఎస్ ఎఫ్ నాయకులు నాగరాజు, జిల్లా కార్యదర్శి కొండ్రపల్లి రమేష్, నగేష్, నవీన్ మద్దిమడుగు, మాతంగి జానీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.