ప్రతి ఓటును కాపాడటం బీఎల్ఏల బాధ్యత: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ 07జూలై (BVK 3 న్యూస్ ) : చందంపేట, నేరేడుగొమ్ము మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ లు), ముఖ్య నాయకులతో నిర్వహించిన ఎస్ఐఆర్ విధానంపై అవగాహన సదస్సులో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి బూత్‌లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్ఏ లు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్ఏ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.
దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మరియు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండొద్దని బిజెపి పార్టీ కుట్ర చేస్తున్నదని తెలిపారు.
దేశ ఎన్నికల కమిషన్ ని బిజెపి పార్టీ చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు మరియు కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తగ్గించాలని కుట్ర చేస్తుందన్నారు.
"ప్రజలకు ఓటు కల్పించి వారి హక్కులను, ప్రభుత్వ పథకాలను వారికి అందేలా చూడాల్సిన బాధ్యత బిఎల్ఏలదే అన్నారు."
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నింపించి, నిర్ణీత గడువులోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన వారందరి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
బూత్ లెవల్ అధికారులు ( బీఎల్ఓ లు), బీఎల్ఏ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే ప్రతి అర్హుడి ఓటును కాపాడగలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఎస్ఐఆర్ విధానంపై పూర్తి అవగాహన కల్పించి, ఎవరి ఓటు కూడా అనవసరంగా తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అనంతరం "ఎస్ఐఆర్ కార్యక్రమంలో చురుకుగా పనిచేస్తున్న బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ లు), కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు."
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, నల్లగొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, చందంపేట మాజీ ఎంపీపీ ఏడుపుల గోవింద్ యాదవ్, చందంపేట మండల అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు వాంకునావత్ బిక్కు నాయక్, ఈ మండలాల మాజీ అధ్యక్షులు జరుపుల బధ్యా నాయక్, లోకాసాని కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు కోతి యుగేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, నియోజకవర్గ ఎస్ఐఆర్ కో ఆర్డినేటర్ కొర్ర రాంసింగ్, చందంపేట, నేరేడుగొమ్ము మండలాల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు, సర్పచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ బీఎల్ఏ లు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.