🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 07 Jul, 2026 | Page: 1

ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలి: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ 07జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా తన ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ఓ) కు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, తమ ఓటు వివరాలను పరిశీలించుకుని అవసరమైనట్లయితే ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి నిర్ణీత గడువులోపు సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఓటరు జాబితాలో పేరు సక్రమంగా ఉండటం ద్వారా మాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోగలరని, అందువల్ల ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా బీఎల్ఓ లను లేదా సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ లు) ప్రజలకు ఎస్ఐఆర్ విధానంపై అవగాహన కల్పించి, ప్రతి అర్హుడి ఓటు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ప్రతి కుటుంబం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మండల తహసీల్దార్ సంజీవ్ కుమార్, ఆర్‌ఐ కర్ణాకర్ రెడ్డి, బూత్ లెవెల్ ఆఫీసర్ కిషన్, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ కొర్ర రాంసింగ్, గ్రామ సర్పంచ్ నేనావత్ కవిత – లచ్చిరాం, బీఎల్ఏ కొర్ర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home