🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 08 Jul, 2026 | Page: 1

16వ వార్డులో సర్- హెల్ప్ డెస్క్ ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని..

నారాయణపేట, జూలై 8( బి వి కే న్యూస్)
మక్తల్ మున్సిపాలిటీ 16 వ వార్డులో సర్...ఓటరు జాబితా సవరణ ప్రక్రియ లో భాగంగా...
మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు.. వార్డులోని ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటరు ఫామ్ లు నింపడం కోసం హెల్ప్ డెస్క్ ను బుధవారం స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
సర్ ప్రక్రియ అత్యంత కీలకమని, ఒక్క తప్పు కూడా లేకుండా, సర్ ప్రక్రియ లో భాగంగా ఓటరు ఫారాలను అడిగిన అన్ని వివరాలు జోడించి, ఫారాలను బీఎల్వోలకు నిర్ణీత సమయంలో అందించాలని సూచించారు.
సర్ ప్రక్రియ లో భాగంగా ఫారాలు నింపి ఇవ్వకపోయినా, వివరాలు అందించకపోయినా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. హెల్ప్ డెస్క్... ఓటర్లకు అండగా నిలిచి, ఫారాలపై అవగాహన కల్పించి, సరిగా నింపి ఇవ్వడంలో సహకరిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్ప్ డెస్క్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, మార్కెట్ డైరెక్టర్ శాలం, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, హెల్ప్ డెస్క్ ప్రతినిధులు అప్రోచ్, నవీద్ ,నాదర్, రంజాన్ ,బాసిత్ , రాజశేఖర్ ,తౌఫిక్ అహ్మద్, యూసుఫ్, నారాయణరెడ్డి , మదన్, వినయ్, శ్రీహరి, అశోక్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home