దేవరకొండ రిటైర్డ్ ఉద్యోగుల సేవాసదనం నిర్మాణానికి దాతల చేయూత: రూ. 10,116/- విరాళం అందజేసిన కర్నాటి పాపయ్య దంపతులు.
దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సేవాసదనం మొదటి అంతస్తూ నిర్మాణ నిధికి దేవరకొండ వాస్తవ్యులు కర్నాటి పాపయ్య-ఆండా ళమ్మ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురువారం జరిగిన సమావేశంలో అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ,కోశాధికారి పంగునూరు లింగయ్యలకు రూ. 10,116/- ల చెక్కు అందజేసినారని ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ తెలియజేసినారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ మాట్లాడుతూ దాతల ఆర్థిక సహకారంతో త్వరలో భవనం పూర్తి చేస్తామని తెలియజేసినారు. జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ 70 సంవత్సరాలు నిండని పెన్షనర్స్ ఎస్బిఐ యందు ఖాతా గలవారు తమ ఖాతాను కంప్రిహేన్సివ్ పెన్షన్ ప్యాకేజి ఖాతాగా మార్చుకొన్న కొన్ని రకాల ప్రయోజనాలు కలవు అన్నారు. అనంతరం దాత కర్నాటి పాపయ్య మాట్లాడుతూ దేవరకొండలో పెన్షనర్స్ సేవాసదన భవనం చక్కగా నిర్మించి సేవలు అందించడం నాకు చాలా ఆనందం కలిగి ఆర్థిక సహాయం అందజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు జంపాల యాదగిరి,ముసిని వీరయ్య, మోటమర్రి పురుషోత్తం, కర్నాటి సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, అలంపల్లి శ్రీనివాస్, లక్ష్మణాచారి, లక్ష్మయ్య, అప్పం వీరయ్య,జగన్ తదితరులు పాలుగొన్నాని దాతకు కృతజ్ఞతలు తెలియజేసినారు.