ఓ మనిషి
ఏకాగ్రతే నీవిజయం
చంచలమైన ఈ జగత్తులో
మనిషి మనసుస్థిరంగా
ఉండదు పలు ఆలోచనలతో
నిరంతరం ఒత్తిడికి గురై
ఆందోళన సుడిగుండంలో
చిక్కుకుని కుంగుబాటుకు
మనసు కుదేలౌతుంది
చిత్తం శివుని మీద భక్తి
చెప్పుల మీద అన్నట్లు
మనిషి ఉన్న చోట మనసు
ఉండదు పలు కోర్కెలు
మనసులో పరుగులు
తీస్తూ సమస్యల సుడి
గుండాన్ని సృష్టిస్తాయి
ఓ మనిషి నీమనసును
అదుపులో పెట్టుకో
నీ మనసు ఎటుపోతోందో
చూడు స్థిరత్వం లేని
ఆలోచనలు మానుకొని
నీగమ్యం వైపుదృష్టి నిలుపు
ఏకాగ్రత జీవిత లక్ష్య
సాధనకు చుక్కాని
ఏకాగ్రత కోల్పోతే
సర్వం శూన్యం
ఏకాగ్రత మనసును నిలిపే
మహా యోగం లక్ష్యాన్ని చేరే
దివ్యమార్గం సిరిసంపదలు
ఏకాగ్రతకు సరిపోవు
ఏకాగ్రత నిన్ను విజేతగా
నిలిపే గొప్ప సాధనం
ధనం అధికారం ఆర్భాటం
అట్టహాసం ఈరోజువస్తుంది
రేపు పోతుంది సుస్థిరం కాదు
కస్టపడి సంపాదించిన ఆస్తులు
ఎప్పుడైనా కరిగిపోతాయి
బోగ భాగ్యాలు ఎప్పటికీ ఉండవు
ఏకాగ్రత నీఅమూల్య సంపద
దోపిడీకి గురి కానిది ఏకాగ్రతే
లక్ష్య సాధనలోనీవు చూపే
స్థిరమైన నీఏకాగ్రతే నీజీవితాన్ని
మార్చే గొప్పసంపద
విద్యార్థులు ఉద్యోగులు
వ్యాపారులు సంస్థలు తమ
బాధ్యతలనిర్వహణలో
పాటించే ఏకాగ్రత అభివృద్ధికి
ఊతంగానిలుస్తుంది
ఓ మనిషి సమయం కంటే
ఏకాగ్రతే అత్యంత విలువైన
సంపద ఎక్కువ సమయం
తీసుకొని పర ధ్యానంతో
వ్యవహరించే వారికంటె
తక్కువ కాలంలో పూర్తి
ఏకాగ్రతతో పనిచేసే వ్యక్తులు
చాలా మెరుగైన ఫలితాలు
సాధిస్తారు
లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి
దారిలో వచ్చే అడ్డంకులను
ధైర్యంతో దాటాలి
గెలుపు తీరాలను చేరాలి
మనో స్థిరత్వంతో పనులు
సులభంగా చేకూరుతాయి
కష్టాన్ని ఇష్టంగామార్చుకుంటే
విజయాలు నీ కాళ్ళ దగ్గరికి
వస్తాయి లోకానికి స్పూర్తి వై
ఇతరులకు మార్గదర్శి అవుతావు
ఆకర్షణలు నిన్ను చుట్టు
ముడుతున్న వాటిని
పక్కన నెట్టేసి నీ పనిపైనే
నీవు మనసు పెట్టు
సముద్రపు అలలు లాంటి
ఆలోచనలను నియంత్రించి
కార్యసిద్ధిపై దృష్టి పెట్టు
అప్పుడే నీకు గుర్తింపు
చరిత్ర పుటల్లో నిలిచి
మహనీయుడివి అవుతావు
కాలం విలువైంది
గడచిన కాలం తిరిగి రాదు
సమయాన్ని సద్వినియోగం
చేస్తూ ఏకాగ్రత మీద దృష్టి
పెడితే నీ భవిష్యత్తు
బంగారు బాట అవుతుంది
కోట్లు గడించిన ఏకాగ్రత
లేకపోతే అంతా శూన్యమే
అందుకే ఓ మనిషి నిన్ను
నీవు నమ్ముకో ఏకాగ్రతతో
భవిష్యత్తును గెలుచుకో
ఆలోచనల అలలు అణిచి వేసి
ఆశయసాధనకు వారథియై
జీవిత గమనాన్ని మార్చి వేసే
అత్యంత విలువైన ఏకైక సంపద
ఏకాగ్రతే
బంగారం వెండి కాదు
అసలైన ఆస్తి నీ లోపల
ఉన్న ఏకాగ్రతే నీనిజమైనశక్తి
బాహ్య ప్రపంచపు
అల్లర్లను వదిలేయ్
నీ మనసును ఒక చోట
నిలపడం నేర్చుకో
అపుడే అనుకున్నది సాధిస్తావు
సమాజానికి ఆదర్శంగా నిలుస్తావు
మనో నియంత్రణ యజ్ఞంలో
ఏకాగ్రతే ఆయుధంగా సాహసమే
ఊపిరిగా లక్ష్యసాధనే మార్గంగా
ముందుకు సాగుదాం
మానవాభివృద్ధిని సాద్ధిదాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
కాలమిస్ట్ రచయిత
కరీంనగర్9440245771
చంచలమైన ఈ జగత్తులో
మనిషి మనసుస్థిరంగా
ఉండదు పలు ఆలోచనలతో
నిరంతరం ఒత్తిడికి గురై
ఆందోళన సుడిగుండంలో
చిక్కుకుని కుంగుబాటుకు
మనసు కుదేలౌతుంది
చిత్తం శివుని మీద భక్తి
చెప్పుల మీద అన్నట్లు
మనిషి ఉన్న చోట మనసు
ఉండదు పలు కోర్కెలు
మనసులో పరుగులు
తీస్తూ సమస్యల సుడి
గుండాన్ని సృష్టిస్తాయి
ఓ మనిషి నీమనసును
అదుపులో పెట్టుకో
నీ మనసు ఎటుపోతోందో
చూడు స్థిరత్వం లేని
ఆలోచనలు మానుకొని
నీగమ్యం వైపుదృష్టి నిలుపు
ఏకాగ్రత జీవిత లక్ష్య
సాధనకు చుక్కాని
ఏకాగ్రత కోల్పోతే
సర్వం శూన్యం
ఏకాగ్రత మనసును నిలిపే
మహా యోగం లక్ష్యాన్ని చేరే
దివ్యమార్గం సిరిసంపదలు
ఏకాగ్రతకు సరిపోవు
ఏకాగ్రత నిన్ను విజేతగా
నిలిపే గొప్ప సాధనం
ధనం అధికారం ఆర్భాటం
అట్టహాసం ఈరోజువస్తుంది
రేపు పోతుంది సుస్థిరం కాదు
కస్టపడి సంపాదించిన ఆస్తులు
ఎప్పుడైనా కరిగిపోతాయి
బోగ భాగ్యాలు ఎప్పటికీ ఉండవు
ఏకాగ్రత నీఅమూల్య సంపద
దోపిడీకి గురి కానిది ఏకాగ్రతే
లక్ష్య సాధనలోనీవు చూపే
స్థిరమైన నీఏకాగ్రతే నీజీవితాన్ని
మార్చే గొప్పసంపద
విద్యార్థులు ఉద్యోగులు
వ్యాపారులు సంస్థలు తమ
బాధ్యతలనిర్వహణలో
పాటించే ఏకాగ్రత అభివృద్ధికి
ఊతంగానిలుస్తుంది
ఓ మనిషి సమయం కంటే
ఏకాగ్రతే అత్యంత విలువైన
సంపద ఎక్కువ సమయం
తీసుకొని పర ధ్యానంతో
వ్యవహరించే వారికంటె
తక్కువ కాలంలో పూర్తి
ఏకాగ్రతతో పనిచేసే వ్యక్తులు
చాలా మెరుగైన ఫలితాలు
సాధిస్తారు
లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి
దారిలో వచ్చే అడ్డంకులను
ధైర్యంతో దాటాలి
గెలుపు తీరాలను చేరాలి
మనో స్థిరత్వంతో పనులు
సులభంగా చేకూరుతాయి
కష్టాన్ని ఇష్టంగామార్చుకుంటే
విజయాలు నీ కాళ్ళ దగ్గరికి
వస్తాయి లోకానికి స్పూర్తి వై
ఇతరులకు మార్గదర్శి అవుతావు
ఆకర్షణలు నిన్ను చుట్టు
ముడుతున్న వాటిని
పక్కన నెట్టేసి నీ పనిపైనే
నీవు మనసు పెట్టు
సముద్రపు అలలు లాంటి
ఆలోచనలను నియంత్రించి
కార్యసిద్ధిపై దృష్టి పెట్టు
అప్పుడే నీకు గుర్తింపు
చరిత్ర పుటల్లో నిలిచి
మహనీయుడివి అవుతావు
కాలం విలువైంది
గడచిన కాలం తిరిగి రాదు
సమయాన్ని సద్వినియోగం
చేస్తూ ఏకాగ్రత మీద దృష్టి
పెడితే నీ భవిష్యత్తు
బంగారు బాట అవుతుంది
కోట్లు గడించిన ఏకాగ్రత
లేకపోతే అంతా శూన్యమే
అందుకే ఓ మనిషి నిన్ను
నీవు నమ్ముకో ఏకాగ్రతతో
భవిష్యత్తును గెలుచుకో
ఆలోచనల అలలు అణిచి వేసి
ఆశయసాధనకు వారథియై
జీవిత గమనాన్ని మార్చి వేసే
అత్యంత విలువైన ఏకైక సంపద
ఏకాగ్రతే
బంగారం వెండి కాదు
అసలైన ఆస్తి నీ లోపల
ఉన్న ఏకాగ్రతే నీనిజమైనశక్తి
బాహ్య ప్రపంచపు
అల్లర్లను వదిలేయ్
నీ మనసును ఒక చోట
నిలపడం నేర్చుకో
అపుడే అనుకున్నది సాధిస్తావు
సమాజానికి ఆదర్శంగా నిలుస్తావు
మనో నియంత్రణ యజ్ఞంలో
ఏకాగ్రతే ఆయుధంగా సాహసమే
ఊపిరిగా లక్ష్యసాధనే మార్గంగా
ముందుకు సాగుదాం
మానవాభివృద్ధిని సాద్ధిదాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
కాలమిస్ట్ రచయిత
కరీంనగర్9440245771