🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 10 Jul, 2026 | Page: 1

చరిత్ర సృష్టించిన ఎంబాపే..

ఫిఫా వరల్డ్‌కప్‌లో కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) చరిత్ర సృష్టించాడు. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మెగా ఈవెంట్‌లో గోల్డెన్ బూట్(Golden Boot) రేసులో దూసుకెళ్తున్న ఎంబాపే.. ఎనిమిదో గోల్ సాధించాడు. ప్రపంచకప్‌లో ఈ అతడికిది 20వ గోల్ కావడం విశేషం. తద్వారా 30 ఏళ్లలోపే ఈ మెగా టోర్నీలో 20 సార్లు బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపిన తొలి ఆటగాడిగా ఎంబాపే చరిత్రకెక్కాడు.
సాకర్ ఆటలో అతిపెద్ద పండుగైన ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే గోల్స్‌తో రెచ్చిపోతున్నాడు. గత సీజన్ రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ట్రోఫీ అందించాలనే కసితో ఉన్న ఎంబాపే.. ఎనిమిదో గోల్‌తో గోల్డెన్ బూట్ రేసులోకి దూసుకొచ్చాడు.
🏠 Home