హెల్ప్ డెస్క్ లో స్వయంగా ఫారాలు నింపిన వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని..
నారాయణపేట, జూలై 11(బివికె న్యూస్)
మక్తల్ మున్సిపాలిటీ 16 వ వార్డులో హెల్ప్ డెస్క్ లో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు..స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి..
వార్డు పరిధిలోని ఓటర్లకు సర్ ఫారాలను స్వయంగా నింపుతూ.. ఫారాలు అందించడంలో భాగంగా అధికారులకు సహకరించారు.
ఈ సందర్భంగా సర్ ప్రక్రియ లో భాగంగా... ఓటర్లు ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారితో సమీక్షించి, స్వయంగా వివరాలు జోడించి, ఫారాలను వార్డు కౌన్సిలర్ నింపి, అధికారులకు అందజేశారు.
ప్రతి ఒక్కరి ఓటు హక్కు కోల్పోకుండా... అందరికీ ఫారాలు అందజేయడం తో పాటు.. ఫారాలను సరైన వివరాలతో నింపి...బీఎల్వోలకు అందజేసేందుకు ఈనెల 24వ తేదీ వరకే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఆలోపు ఫారాలు అందజేయాలని సూచించారు.
ఓటర్లకు ఫారాలు నింపడంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే.. హెల్ప్ డెస్క్ లో తనతోపాటు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు ఎంతో కీలకమని, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చూడాలని, ఫారాలను సరైన సమయంలో నింపి అందజేయాలని, లేకపోతే ఓటు హక్కు కోల్పోయామని అన్నారు.
ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్ ఎంతగానో సహకరిస్తుందని, ఏర్పాటు చేసిన వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని ని వార్డు ప్రజలు అభినందించారు.
వార్డు కౌన్సిలర్ తో పాటు.. కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్, జిల్లా కార్యదర్శి మఠం వాదిరాజ్, తదితరులు ఉన్నారు.