మైనంపల్లి డిఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా 'హరితహారం' కార్యక్రమం
దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : మైనంపల్లి గ్రామంలోని డిఆర్ఆర్ పాఠశాల ఆవరణలో శనివారం 'హరితహారం' కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనంపల్లి సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రామ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించవచ్చని పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణాల్లో మొక్కలు నాటడం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ మధు, పాఠశాల ప్రిన్సిపాల్, పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కల ప్రాముఖ్యతను తెలుపుతూ విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.