శివాజీ యువదళ్ ఆధ్వర్యంలో విద్యార్ధికి ఆర్థిక సహాయం ..
దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : శివాజి యువదళ్ దేవరకొండ పట్టణ అధ్యక్షుడు పగిడిమర్రి సతీష్ పిఎస్ వి ఎడ్యుకేషన్ & చారిటబుల్ ఫౌండేషన్ తరుపున ఆర్థిక సాయాన్ని ఇద్దంపల్లి గ్రామానికి చెందిన ఏపూరి సన్నీ తండ్రి ఏపూరి పురుషోత్తం వారికి అనారోగ్య సమస్యలు ఉన్న చదువు పై ఆసక్తితో బీటెక్ ప్రథమ సం"లో మంచి ర్యాంక్ సాధించారు ద్వితీయ సంవత్సారానికి గాను ఆర్థిక ఇబ్బంది వల్ల కాలేజీ ఫీస్ కట్టలేక బాధపడుతున్న వారుశివాజీ యువదళ్ ను సంప్రదించడం జరిగింది. వారికి మా ఫౌండేషన్ తరుపున 5000/- రూ ఆర్థిక సాయాన్ని అందించారు ఆ నిరుపేద కుటుంబానికి అన్ని విధాలుగా శివాజి యువదళ్ సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు కార్యక్రమంలో శివాజి యువదళ్ వ్యవస్థాపకులు హరికృష్ణ ముష్టిపల్లి నగర గౌ అధ్యక్షుడు నేతల వెంకటేష్ యువదళ్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు ఐతరాజు శ్యామ్, ప్రధాన కార్యదర్శి ఇరగదిండ్ల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు దుర్యోధన పాటిల్, గుర్రం శ్రీనివాస్, చిలువేరు సత్యం, గాజుల వినయ్ దేవరకొండ మధు, జాడే సాయి, అటకేశ్వరం జగన్ మరియు తదితరులు పాల్గొన్నారు.