🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 13 Jul, 2026 | Page: 1

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ

దేవరకొండ 13జూలై (BVK 3 న్యూస్ ) : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మైనంపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణకు సంబంధించిన అల్బెండజోల్ మాత్రలను స్థానిక సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ స్వయంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... విద్యార్థుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు, రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
​ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.హెచ్.పి స్వాతి, మాజీ ఉప సర్పంచ్ వెంకట్, కొర్ర శ్రీను, లైన్ మెన్ శివ, పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, పాఠశాల ఉపాధ్యాయులు జగదీష్, అంగన్వాడీ ఆయా కళ్ళమ్మ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home