🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 13 Jul, 2026 | Page: 1

మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వ), దేవరకొండలో రికార్డ్ అసిస్టెంట్ ఎ.కల్పనకు ఆత్మీయ వీడ్కోలు

దేవరకొండ 13జూలై (BVK 3 న్యూస్ ) : మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వ), దేవరకొండలో నాన్ టీచింగ్ విభాగంలో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఎ.కల్పన ఓడి (ఆన్ డ్యూటీ) మీదా మిర్యాలగూడలోని కే ఎన్ ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్తున్న సందర్భంగా కళాశాలలో ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ మాట్లాడుతూ కళాశాలకు సంబంధించి ఏ పనిని అప్పగించిన సమర్థవంతంగా నిర్వహించి కళాశాల అభివృద్ధికి దోహదపడ్డారు అని అన్నారు.ఏ ప్రాంతంలో పనిచేసిన కూడా ఇంతే నియమ నిబద్ధతతో పనిచేయాలని మంచి పేరును పొందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి.కోటయ్య అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డా. కె.పృథు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి.లింగారెడ్డి తదితర అధ్యాపకులు అధ్యాపకేదారులు పాల్గొన్నారు.
🏠 Home