నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా మద్దిమడుగు రామస్వామి నియామకం - ఘనంగా సన్మానం
దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా నూతనంగా ఎన్నికైన అడ్వకేట్ శ్రీ మద్దిమడుగు రామస్వామి గారిని రాంపూరం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి రాంపూరం సర్పంచ్ శ్రీమతి అనిత లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై, రామస్వామి గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, విద్యావంతుడైన రామస్వామికి పార్టీలో కీలక బాధ్యతలు దక్కడం సంతోషకరమని, తన మేధస్సుతో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను సత్కరించిన సర్పంచ్ అనిత లక్ష్మణ్ గారికి, గ్రామ ప్రముఖులకు మరియు కార్యకర్తలకు రామస్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత లక్ష్మణ్ గారితో పాటు శివాజీ (మాజీ సర్పంచ్), భీముడు (ఉపసర్పంచ్), గణేష్, శివ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత లక్ష్మణ్ గారితో పాటు శివాజీ (మాజీ సర్పంచ్), భీముడు (ఉపసర్పంచ్), గణేష్, శివ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.