కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన మద్దిమడుగు రామస్వామి - ఘనంగా సన్మాన కార్యక్రమం
దేవరకొండ 14జూలై (BVK 3 న్యూస్ ) : కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన మద్దిమడుగు రామస్వామి బాధ్యతలు స్వీకరించారు. గౌరవనీయులైన ఎమ్మెల్యే బాలునాయక్ గారి మద్దతుతో పార్టీలో ఈ కీలక బాధ్యతలను చేపట్టిన రామస్వామి గారిని, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వర్ , సీనియర్ న్యాయవాదులు మరియు ఆయన సహచర న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.
ఈ అభినందన కార్యక్రమంలో లోహిత్ రెడ్డి, రాములు మాడెం, రామశంకర్, ఐ.వి. ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, ఎర్రకృష్ణ, రవికుమార్, యు. రమేష్, కోరె కిషన్, రాజశేఖర్, జున్నిద్దయ్య, గణేష్, శ్రీకాంత్, ఎం. యాదయ్య, రాజు, వసుకుల శీను తదితర మిత్రులు మరియు ప్రముఖులు పాల్గొని రామస్వామి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మద్దిమడుగు రామస్వామి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, సహకరించిన ఎమ్మెల్యే శ్రీ బాలునాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు, ప్రజల సమస్యలపై పోరాడేందుకు అందరి సమన్వయంతో నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.