🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 16 Jul, 2026 | Page: 1

దేవరకొండ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ: అదనపు తరగతి గదుల నిర్మాణానికి విజ్ఞప్తి

దేవరకొండ 16జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండలోని మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వ)లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులను నిర్మించాలని, అలాగే అసంపూర్తిగా ఉన్న కళాశాల మైదానం ప్రహరీ గోడను పూర్తి చేయాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ నేనావత్ బాలు నాయక్ గారికి కళాశాల ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు.
​గత మూడు సంవత్సరాలుగా కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, అదనపు గదుల ఆవశ్యకతపై ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే బాలు నాయక్ గారు సానుకూలంగా స్పందిస్తూ, కళాశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి , అధ్యాపక బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home