🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 17 Jul, 2026 | Page: 1

సర్ ప్రక్రియలో జరిగిన సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి : పంబాల పర్వతాలు.


దేవరకొండ 17జూలై (BVK 3 న్యూస్ ) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సూచనల మేరకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాంకునావత్ బిక్కు నాయక్, నేరేడుగొమ్ము క్లస్టర్ కో-ఆర్డినేటర్ గిరి యాదయ్య పర్యవేక్షణలో నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామం (పోలింగ్ కేంద్రం నెం. 202)లో ఎన్యూమరేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం,నేడు మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ) శ్రీమతి ఉమాదేవితో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ పంబాల పర్వతాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియలో ఎదురైన సాంకేతిక సమస్యలు,కొన్ని చోట్ల నమోదైన వివరాల్లో జరిగిన పొరపాట్లు,ఓటర్ల వివరాల్లో తలెత్తిన వ్యత్యాసాలను ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సమస్యల కారణంగా అర్హులైన ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా,నమోదైన తప్పులను వెంటనే సరిదిద్దాలని,ప్రతి ఓటరి ఓటు హక్కు పరిరక్షించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పంబాల పర్వతాలు కోరారు.దీనిపై స్పందించిన ఎంఆర్ఓ
ఉమాదేవి,ఓటర్ల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి,సాంకేతిక లోపాలు,నమోదులో జరిగిన పొరపాట్లను నిబంధనల ప్రకారం సవరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు సరైన వివరాలతో ఓటరు జాబితాలో ఉండేలా అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా పంబాల పర్వతాలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
🏠 Home