🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 18 Jul, 2026 | Page: 1

ఘనంగా 41వ కారంచేడు దళిత మృత వీరుల దినోత్సవం

కారంచేడు,చుండూరు దళితుల త్యాగాల స్ఫూర్తితో దేశవ్యాప్త కులోన్మాద,మతోన్మాద దాడులను తిప్పికొడదాం

- డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం
నారాయణపేట, జూలై 18 (బివికే న్యూస్)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో 41వ కారంచేడు దళిత మృతవీరుల దినోత్సవాన్ని సందర్భంగా ఘనంగా క్రొవ్వొత్తుల నివాళులర్పించారు.
1985 జూలై 17న ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలోని కమ్మ కులస్తులు మాదిగ వాడ మంచినీటి చెరువులో పశువులను స్నానం చేయించడాన్ని అడ్డుకున్న మాదిగలను అగ్రకుల అహంకారంతో కమ్మ కులస్తులందరూ ఏకమై పధకం ప్రకారం బరిసెలతో, కొడవళ్ళతో,కత్తులతో గోడ్డన్లతో మాదిగ వాడ పై పడి మహిళలను చేరచి, అడ్డొచ్చినోళ్లపై వెంటాడి వేటాడి జరిపిన నరమేధంలో ఏడుగురు దళితులు చంపబడిన ఘటన ఆనాటి అగ్రకుల అహంకారానికి, అదిపత్యానికి నిదర్శనమన్నారు.
కారంచేడు దళితుల హత్యకు కారణమైన వియ్యంకుడు చెంచు రామయ్య మరియు అతని అనుచరులపై ఎలాంటి చర్యలు చేపట్టకుండానే దాడిలో గాయపడిన దళితుల పరామర్శకు వచ్చిన ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు దిమ్మతిరిగేలా అతనిచ్చిన పండ్లను తిరస్కరించిన దళిత స్త్రీలు తమకు ఆత్మగౌరవమే ముఖ్యమని చాటుకున్న కారంచేడు ఉద్యమం తదనంతరం దేశంలో జరిగిన అనేక అస్తిత్వ పోరాటాలకు పురుడోసిందన్నారు.ఏదేమైన ఆనాటి విప్లవ పార్టీ పీపుల్స్ వార్ కారంచేడు దళితుల హంతకుడు చెంచు రామయ్యను బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం కోసమే తామే చంపినట్టు ప్రకటించిందని గుర్తుచేశారన్నారు.
ఆనాడు అంతటి ఆక్రోశాన్ని నింపిన కారంచేడు ఉద్యమాన్ని కత్తి పద్మారావు బొజ్జతారకం వంటి వారు సంవత్సరంన్నరపాటు నడిపి దళితులపై జరిగే అగ్రకులంహకర దాడులను నిరోధించేలా ప్రభుత్వాలు కఠినమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చేలా ఒత్తిడి తెచ్చారన్నారు.అయినప్పటికీ దళితులపై కులంహ్కార దాడులు ఆగకపోవడం బాధాకారమన్నారు.
ఇంతటి నీచమైన నిచ్చెనమెట్ల కులవ్యవస్థను,మనువాద సిద్ధాంతాన్ని నమ్మే బిజెపి 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దళితులపై కుట్రతో కఠినమైన నాన్ బెయిలబుల్ గా ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంను నీరు గార్చేలా దానికి డీఎస్పీ ఎంక్వయిరీ తరవాత ఎఫైర్ నమోదు చేయాలని,తీవ్రమైన రక్త గాయాలైతేనే రిమాండ్ చేసేలా బెయిలబుల్ చట్టంగా మార్చిందన్నారు.
అదేవిధంగా కారంచేడు చుండూరు దళిత మృత వీరుల స్ఫూర్తితో నేటికీ గ్రామాల్లో అమలవుతున్న అంటరానితనానికి,ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడటమే వారికి మనమిచ్చే నిజమైన నివాళన్నారు.
ఈ కార్యక్రమంలో...
అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్,సలహా దారులు పోలప్ప,దళిత ప్రజా సంఘాల నాయకుడు నాగేష్ జీర్గల్,DTF జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర,RTI జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి నారాయణ,KNPS జిల్లా నాయకులు విజయ్ కుమార్ రాములు, AYAM కోశాధికారి త్రిమూర్తి,నాయకులు కర్రెం అంజయ్య,MRPS మక్తల్ మండల నాయకలు జగ్గలి అంజప్ప,MRPS ఉజ్జెల్లి నాయకులు కృష్ణ,పుడమి ఫౌండేషన్ రవి,పెరియార్ సంఘం అక్షయ్,ఎరుకలి సంఘం వెంకయ్య,AYAM ఉప్పర్పల్లి అధ్యక్షులు బాలకృష్ణయ్య,కాంగ్రెస్ పార్టీ నేత గోలపల్లి నారాయణ,మొగ్డుంపూర్ ex సర్పంచ్ మోహన్,ex కౌన్సిలర్ మొగులప్ప, మున్సిపల్ కర్రెం ఆశన్న, కర్రెం అంజప్ప,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తల్వార్ నరేష్, శ్రీహరి,సందీప్, కోరి పవన్, జగ్గలి వేణు,ఆనంద్,రాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home