🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 19 Jul, 2026 | Page: 1

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్  పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో...

- కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
- డిమాండ్ చేసిన ఎ సలీం
సీపీఐ(ఎం ఎల్ )మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి
నారాయణపేట, జూలై 19 (బీవీకే న్యూస్)
సొనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష విరమింప చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్  పార్టీ కేంద్ర కమిటీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే పిలుపులో భాగంగా మక్తల్ పట్టణంలో ఆదివారం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు  చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎ సలీం సీపీఐ(ఎం ఎల్ ) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి, ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు భగవంతు, టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు కిరణ్, పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు శారద, సీపీఐ(ఎం ఎల్ )మాస్ లైన్ నాయకులు కళ్యాణం రాజు, టి యు సి ఐ జిల్లా కోశాధికారి కొలిమి రాములు, టి ప్ర జి ప వ యు నాయకులు నరేష్ లు ప్రసంగిస్తూ
సొనమ్ వాంగ్ చుక్  భరతదేశం లోని లడఖ్‌కు చెందిన ఇంజనీర్, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణ ఉద్యమకారుడు అన్నారు.
1988లో ఎస్ ఇ సి ఎం ఓ ఎల్ SECMOL ( స్టూడెంట్స్ ' ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ అఫ్ లడఖ్ ) సంస్థను స్థాపించి, లడఖ్‌లో విద్యా విధానంలో సంస్కరణలకు కృషి చేశారు.
లడఖ్‌లో నీటి కొరతను తగ్గించేందుకు Ice Stupa అనే కృత్రిమ హిమానీనద సాంకేతికతను అభివృద్ధి చేశారన్నారు.
పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, స్థానిక అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాల కోసం ఆయన ప్రసిద్ధి చెందారు.
2018లో ఆయనకు రామన్ మాగ్సెసే అవార్డు లభించిందన్నారు.ఇటీవలి కాలంలో నీట్ పేపర్ లీక్ కారణంగా సుప్రీంకోర్టు జస్టిస్ వ్యాఖ్యలతో కాక్రోచ్  జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్మంతర్ దగ్గర జరుగుతున్న నిరసనలో భాగంగా సొనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 20 రోజులు గడుస్తున్నప్పటికిని కేంద్ర ప్రభుత్వం చర్చలు చేపట్టలేదు. దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరించింది.  పైగా సోనం వాంగ్చుక్కు పై దేశద్రోహి అని ముద్ర వేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిందితులకు వత్తాసు పలుకుతుందని విమర్శించారు. నీటి పేపర్ లీకేజీ చేసిన దొంగలను కఠినంగా శిక్షించాలని కోరారు. పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటయ్య, చంద్రప్ప నరసింహులు లక్ష్మమ్మ, సాయప్ప లక్ష్మయ్య నర్సింలు మల్లేష్  అంజి  మహేష్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home