🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 19 Jul, 2026 | Page: 1

దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 300 మందికి అల్పాహార పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘వీల్స్ అండ్ మీల్స్’ కార్యక్రమం
​వనం మౌనిక జన్మదినాన్ని పురస్కరించుకొని కిచిడి పంపిణీ
దేవరకొండ 19జూలై (BVK 3 న్యూస్ ) : లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆసుపత్రి రోగులు అటెండర్స్ ఆకలిని తీర్చడం కోసం వీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా చేపడుతున్నట్లు దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య అన్నారు.
దేవరకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ ఫాస్ట్ జోన్ చైర్మన్ లయన్ వనం శ్రీనివాసులు కుమార్తె వనం మౌనిక జన్మదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 300 మందికి అల్పాహారం ( కిచిడి) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ లయన్స్ సభ్యుల కుటుంబ సభ్యుల జన్మదినాలు వివాహ వార్షికోత్సవాల సందర్భంగా ఆసుపత్రి వద్ద కిచిడి ఏర్పాటు చేసి ఆసుపత్రి రోగులకు అటెండర్స్కు అందిస్తున్నామని తెలిపారు. మౌనికకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కసిరెడ్డి రవీందర్ రెడ్డి ,ట్రెజరర్ చిలుకూరి కాశీనాథ్ ,ఫాస్ట్ ప్రెసిడెంట్ వనం శ్రీనివాసులు, సీనియర్ లయన్స్ చీదెళ్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ పి జె సామ్సన్, కొండూరు ఆంజనేయులు, లకుమారపు మల్లయ్య అవిరినేని వెంకటేశ్వరరావు, జైపాల్ రెడ్డి ,పృథ్వి అంజన్, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home