🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 19 Jul, 2026 | Page: 1

నేరడుగోమ్ము మోడల్ స్కూల్‌లో ఘనంగా పేరెంట్-టీచర్స్ మీటింగ్

దేవరకొండ 19జూలై (BVK 3 న్యూస్ ) : స్థానిక నేరడుగొమ్ము మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో శనివారం తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ప్రిన్సిపాల్ అజ్మీరా కోటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి,విద్యార్థుల విద్యా ప్రగతికి సంబంధించి ఎజెండాలో పొందుపరిచిన పలు ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) శాతాన్ని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తల్లిదండ్రులతో కలిసి కార్యాచరణను చర్చించారు.విద్యార్థుల చదువుల నాణ్యత, పరీక్షల్లో వారి ప్రతిభ మరియు తరగతి గదుల్లో వారి ప్రగతిని ప్రదర్శిస్తూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు.పిల్లల క్రమశిక్షణ,ఇంటి వద్ద చదువుకునే వాతావరణం కల్పించడం మరియు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని తల్లిదండ్రుల చేత వాగ్దానం చేయించారు. ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు ఒకరినొకరు వ్యక్తిగతంగా కలిసి పిల్లల చదువు,ప్రవర్తనపై ప్రత్యేకంగా సంభాషించారు.పాఠశాల మెరుగైన నిర్వహణ కోసం తల్లిదండ్రుల నుంచి విలువైన సలహాలు,అభిప్రాయాలను సేకరించారు. సలహాలు,సూచనలు అందజేసిన తల్లిదండ్రులు:సమావేశంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో అందుతున్న విద్యా వసతుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, మరింత ప్రగతి సాధించడానికి తమ వంతు సలహాలను, సూచనలను యాజమాన్యానికి రాతపూర్వకంగా, మౌఖికంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల అధ్యాపక బృందం,విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం భాగస్వాములైన తల్లిదండ్రులందరికీ ప్రిన్సిపాల్ అజ్మీరా కోటేశ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
🏠 Home