🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 22 Jul, 2026 | Page: 1

నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే అరెస్టులా?

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేవరకొండలో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన
దేవరకొండ 22జూలై (BVK 3 న్యూస్ ) : ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అరెస్ట్ ను ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఏఐసీసీ పిలుపుమేరకు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో, దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ గారి సూచన మేరకు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య బద్ధంగా విద్యార్థులకు సంఘీభావంగా నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో తన గలాన్ని వినిపించడంతోపాటు బయట విద్యార్థుల పక్షాన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ విద్యార్థులకు జవాబుదారిగా ఉండాలని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్టు చేయడం దీనిని విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి విద్యార్థులకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం అరెస్టులకు తిరగేసిందని మోదీ మొండి వైఖరిని నిరసిస్తూ దేవరకొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముకురోజు రాజు గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మరియు ప్రియాంక గాంధీ గారి అక్రమ అరెస్టులు ఖండించడం జరిగింది, ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడ సైదులు , నేనావత్ మోతిలాల్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దుబ్బాచరణ్, పులిజాల వెంకటయ్య, నందోజు అంజి,తదితరులు పాల్గొన్నారు.
🏠 Home