🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 23 Jul, 2026 | Page: 1

నా చావుకు ప్రధాని మోదీనే కారణం..

ఎల్లారెడ్డిపేట : నా చావుకు ప్రధాని నరేంద్ర మోదీనే(PM Modi )కారణమంటూ సర్‌ ఫాం(SIR) మీద సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు(Youth commits suicide) పాల్పడటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నా చావుకు కేవలం ప్రధాని నరేంద్ర మోదీనే కారణమని, ఎవరిని ఏం అనొద్దని తెలుపుతూ SIR ఫాం మీద స్పష్టంగా సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వంశీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
🏠 Home