🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 23 Jul, 2026 | Page: 1

తుంగభద్రకు పెరిగిన వరద

తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురవడంతో 13,800 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యాంలో నీటి నిల్వలు 1603.54 అడుగుల వద్ద 26.454 టీఎంసీలకు చేరాయి. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వారం రోజులుగా ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులకు పడిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తాజా వర్షాలు ఊరటనిస్తున్నాయి.

🏠 Home