షిర్డీ వెళ్లే భక్తులకు IRCTC బంపర్ ఆఫర్
షిర్డీ వెళ్లే సాయిబాబా భక్తులకు IRCTC బిగ్ అప్డేట్ ఇచ్చింది. ప్రతీ వారం హైదరాబాద్ నుంచి షిర్డీకి ప్రత్యేకంగా రైలు ఏర్పాటు చేసారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ నుంచి షిర్డీ యాత్రకు వీలుగా స్పెషల్ ప్యాకేజీని ఐఆర్సీసీటీ ప్రకటించింది. ప్రతీ బుధవారం కాచిగూడ నుంచి ఈ రైలు షిర్డీకి బయల్దేరుతుంది. వివిధ కేటగిరీల్లో అమలు కానున్న ప్యాకేజీ ధరలను అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లే సాయిబాబా భక్తుల కోసం తక్కువ బడ్జెట్ లో మూడు రోజుల యాత్ర ను ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీకి సాయి సన్నిధిగా పేరు ఖరారు చేసిన అధికారులు.. ప్రతీ బుధవారం కాచిగూడ నుంచి ఈ రైలు బయల్దేరుతుందని వెల్లడించారు. ఈ రైలులో థర్డ్ ఏసీతో పాటుగా స్లీపర్ క్లాస్ అందుబాటులో ఉంటుంది. అయితే, ప్యాకేజీలో భాగంగా కంఫర్ట్ 3 ఏసీ : సింగిల్ : రూ.7920, డబల్ రూ.6700, త్రిబుల్ రూ.6690, 5-11ఏళ్ల పిల్లలకు రూ.6080, 5-11ఏళ్ల పిల్లలకు వితౌట్ బెడ్ రూ.5050గా నిర్ణయించారు. అదే విధంగా స్లీపర్ (SL) : సింగిల్ రూ.6370, డబల్ రూ.5100, త్రిబుల్ రూ.5100, 5-11ఏళ్ల పిల్లలకు రూ.4390, 5-11ఏళ్ల పిల్లలకు వితౌట్ బెడ్ రూ.3360 గా అధికారులు వివరించారు.