🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 23 Jul, 2026 | Page: 1

నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన

రాష్ట్రంలో రైతుల పరిస్థితి నానాటికి దైన్యంగా మారుతుంది. అటు ప్రకృతి కన్నెర, ఇటు వ్యాపారుల మోసాలతో రైతులు అరిగోస పడుతున్నారు. సకాలంలో ఎరువులను ప్రభుత్వం అందించకపోవడంతో వేసుకున్న పంటను కాపాడుకునేందుకు నేరుగా వ్యాపారులను, మధ్యవర్తుల వద్ద కొనుగోలు చేస్తున్న ఎరువులు, విత్తనాలు నకిలీగా తేలుతుండడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు.
నాగర్ కర్నూల్( Nagar Kurnool ) జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామానికి చెందిన రైతు భీమ్ రెడ్డి( Bheem reddy ) అదే గ్రామానికి చెందిన వ్యాపారి ఉదయ్ రెడ్డి వద్ద 70 బస్తాల డీఏపీని ఒక్కొక్క బస్తా 1,400 రూపాయలకు కొనుగోలు చేశాడు.
🏠 Home