🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 24 Jul, 2026 | Page: 1

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి పార్టీ విజయకేతనం ఎగురవేయాలి

జనసేన పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సొంతంగా పనిచేశారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఈరోజు(శుక్రవారం) జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర బాగు ‌కోసం కూటమి విజయం సాధించాలని అందరం క‌లిసి పని చేశామని చెప్పారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం అంతా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిత్రపక్ష పార్టీల‌ నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నేతలకు సూచించారు.
పార్టీ కోసం పని చేసే వారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తించి‌ ప్రోత్సహిస్తారని మంత్రి తెలిపారు. జనసేన పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేలా పని చేయాలని అన్నారు. జనసేన పార్టీ బలం పెంచుకోవడం ద్వారా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. నేడు జనసేనలో ఎంతోమంది సామాన్య కార్యకర్తగా పని చేసి వివిధ హోదాలు సంపాదించారన్నారు. రాష్ట్రంలో వైసీపీ వంటి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేలా అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.
🏠 Home