జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలకు సంఘీభావ కొవ్వొత్తుల ప్రదర్శన
దేవరకొండ 25జూలై (BVK 3 న్యూస్ ) : నల్గొండ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ పైన విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉద్యమకారులకు సంఘీభావం తెలియజేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనను నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్ నేత నేతృత్వంలో శనివారం నల్గొండ కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్ నేత మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో విద్యార్థులు తమ హక్కుల కోసం నెల రోజులపాటు చేసిన నిరసన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పున్న వెంకటేశ్వర్లు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంతు వెంకటేష్ గౌడ్, దేవరకొండ చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నబోయిన సైదులు,మోర అశోక్ గుర్రం నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.