🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 27 Jul, 2026 | Page: 1

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా అథ్లెటిక్స్ స్వర్ణ పతక విజేత నారీమల్ల ప్రవళిక ఘన సత్కారం

దేవరకొండ 27జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు సోమవారం నారీమల్ల ప్రవళిక 12-07-2026 నాడు చైనాలో జరిగిన ఆసియా అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 4 ఐ 400 మీటర్ల మహిళల రిలే లో ప్రవళిక కు స్వర్ణం వచ్చిన సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వి టి సభ్యులతో కలిసి తాను సాధించిన స్వర్ణ పథకాన్ని మెడలో వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక బీద కుటుంబం నుండి పట్టుదలతో నిరంతర కృషితో భారతదేశానికి స్వర్ణ పథకం అందించిన నారీమల్ల ప్రవళిక నేటి యువతకు ఒక స్ఫూర్తి అన్నారు. చదువులో కూడా ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా మొదటి ర్యాంకులో ఉండడం కూడా గొప్ప విషయమని, తల్లిదండ్రులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ బిడ్డని ఎంతో ప్రోత్సహించి భారతదేశానికి అందించినారని, ఇలాంటి క్రీడా రత్నాలు ఎంతోమంది దేవరకొండ నియోజకవర్గం లో ఉన్నారని, వారికి క్రీడా స్థలాలు లేకపోవడం దురదృష్టకరమని, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు అందుబాటులోకి వస్తే ఎంతోమంది క్రీడాకారులు మన భారతదేశానికి ఆడతారని, దేవరకొండ నియోజకవర్గంకి గొప్ప పేరు వస్తుందని, అలాగే యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా దూరంగా ఉంటారని , ప్రవళిక లాంటి క్రీడాకారులు ఎంతోమంది తయారు అవుతారని అన్నారు. అందుకని దయచేసి ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ క్రీడాకారులపై దయవుంచి స్టేడియాల అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా అన్నారు. 12 సంవత్సరాల నుండి దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ స్టేడియాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నదని అన్నారు. అలాగే కోచ్ పరశురాముని కూడా అభినందించినారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, రాపోలు నిరంజన్, వైయస్ కరుణాకర్, శైలేష్ వల్లమల్ల ఆంజనేయులు, సన్నీ, కౌన్సిలర్స్ పొట్ట మురళి, సాయి చంద్ర గౌడ్ ,కరాటే మాస్టర్ గోపి, రాజు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ జాంగిర్ మరియు విద్యార్థులు. వివేకానంద ఒకేషనల్ కాలేజ్ రోజా, లావణ్య, అంజలి, విద్యార్థులు. శివ ,సందీప్, శివకుమార్, వినయ్, యశ్వంత్, ఉదయ్, శ్రీను, సురేందర్, హనుమంత్, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home