🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 27 Jul, 2026 | Page: 1

ఆకివీడు రామాల‌యానికి సుప్రీంకోర్టు అనుమ‌తి..

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిపాదిత రామాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లా కలెక్టర్ జారీచేసిన నిరభ్యంతర పత్రం చట్టబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ప్రభుత్వ స్థలంలో నిబంధనల మేరకు ఆలయ నిర్మాణం చేపట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్న‌ది.
🏠 Home