దుస్తుల్లోనే మూత్ర విసర్జన చేసిన ఐదేళ్ల బాలుడు.. ప్రైవేట్ పార్ట్స్‌పై వాతలు పెట్టిన టీచర్
యూపీ, వారణాసిలోని ఒక పాఠశాలలో దారుణం జరిగింది. క్లాస్‌రూమ్‌లోనే ఒక విద్యార్థి, దుస్తుల్లోనే మూత్రం పోయడంతో ఆగ్రహం చెందిన టీచర్.. ఆ బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టారు. ఈ ఘటన ఈ నెల 24న వారణాసిలోని ఒక ప్రైవేటు స్కూల్‌లో జరిగింది. దీనిపై బాధిత విద్యార్థి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు పాఠశాలలో ఐదేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు.
అతడికి ఈ నెల 24న మూత్రం రావడంతో వాష్ రూమ్‌కు వెళ్తానని టీచర్‌ను అడిగాడు. కానీ, బాలుడు వాష్ రూమ్‌కు వెళ్లేందుకు టీచర్ నిరాకరించాడు. దీంతో కొద్దిసేపటి తర్వాత చిన్నారి బాలుడు దుస్తుల్లోనే, క్లాస్ రూమ్‌లో మూత్రం పోసుకున్నాడు. దీనిపై ఆగ్రహం చెందిన టీచర్.. ఆ బాలుడిని ప్రత్యేక గదికి తీసుకెళ్లి, ఒక చిన్న కత్తిని వేడి చేసి, బాలుడి మర్మాంగాలపై వాతలు పెట్టారు. దీంతో బాలుడికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన బాలుడి తండ్రి టీచర్‌పై, స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్థానిక లాల్‌పూర్-పాండేపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో టీచర్‌పై, ప్రిన్సిపాల్‌పై, స్కూల్ మేనేజ్‌మెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని ఆస్పత్రికి తరలించారు.