🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 28 Jul, 2026 | Page: 1

మట్టి మనుషులు సృష్టికర్తలు ( కుమ్మర వృత్తి కళాకారులు)

(నాగరికత ఎంతగా విస్తరించిన
సాంకేతికత పెరిగినా మన మూ లాలు ఎప్పుడు మట్టిలోనే ఉంటా యి.మట్టిని నమ్ముకుని ఆమట్టి ముద్దకు ప్రాణం పోస్తూ సమాజ ప్రగతికి సంస్కృతికి ఆధారంగా నిలిచిన అపర సృష్టికర్తలు మన "కుమ్మర్లు" నేషనల్ క్లే డే వారోత్సవాల(జూలై 25 _ 31) సందర్భంగా మట్టితో ముడిపడిన మన జీవితాన్ని కుమ్మరి వృత్తి విశిష్టతను కొనియాడుతూ
రాసిన కవిత )
మట్టి నుండి పుట్టింది జీవం
మట్టితోనే ముడి పడింది జీవితం
కుమ్మరి చేతిలో ఆకృతి దాల్చే
మట్టి పాత్రలు కుండలు
ఆరోగ్యానికి అమృతం లాంటివి
ఈ నేల తల్లి ఇచ్చిన వరం
కుమ్మర వృత్తి మట్టితో
మాణిక్యాలు చేసి
ఆధ్యాత్మిక సాంస్కృతిక
వైభవం పునరుత్తేజానికి
నిరంతరం శ్రమించే కుమ్మర
వృత్తి కార్మికుడి వృత్తి
కౌశలానికి ప్రతీక కుమ్మరం
సారెపై తిరిగే చక్రం కాలచక్రం
కుమ్మరి శ్రమలోనే ఉంది
సమాజ హితం
మట్టి ముద్దను అమృత
భాండంగా మార్చే కుమ్మరి
చేతుల్లో ఉంది సృష్టి
చమత్కారం
ఎండనక వాననక మట్టిని
పిసికి పసిపాపల దానికి రూపం
ఇచ్చి కుండై ఊరి దాహం తీర్చే
పుణ్యమూర్తి కుమ్మరి
కుమ్మరం సమాజ ప్రగతికి
మూలమైన శ్రామిక కీర్తి
శ్రమ సంస్కృతికి ప్రతిబింభం
ఆధునిక నాగరికత ఎన్ని రంగులు
మార్చినా కుమ్మరిచేసిన మట్టి
పాత్రల విలువ మారునా?
మట్టి పాత్రల్లో వంట ఒంటికి
మంచిది బిపి షుగర్ క్యాన్సర్
వ్యాధులను నిరోధించి
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మనిషి పుట్టుక పెళ్లి చావుకు
మానవ జీవితంతో కుమ్మరి
చేసిన కుండకు విడదీయరాని
సంబంధం ఉంది.
పండుగైన పబ్భమైన ప్రమిదై
వెలిగేది సంస్కృతిని నిలబెట్టి
జీవనజ్యోతిని వెలిగించేది
కుమ్మరి చేసిన మట్టి పాత్రల్లోనే
మట్టిని ప్రేమిద్దాం కుమ్మరవృత్తి
గౌరవిద్దాం
నేషనల్ క్లే డే వారోత్సవాల
సందర్భంగా కుమ్మర
వృత్తిదారుల శ్రమను గౌరవిద్దాం
ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు
పాటుపడి అందరికీ ఆరోగ్యాన్ని
అందించే కుమ్మర వృత్తిని
ప్రభుత్వం పౌరసమాజం
పునర్జీవింప చేయాలి
ప్రభుత్వం యూనివర్సిటీల్లో
వృత్తి విద్యా సంస్థల్లో పింగాణి
టెర్రకోట పాటరీ కోర్సును
పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టీ
యువతకు ఉపాధి కల్పించాలి
కుండలో నీరుచల్లదనాన్ని
ఇస్తుంది వాటిని తయారు
చేసే కుమ్మరి శ్రమ మాత్రం
సమాజానికి జీవనాన్ని ఇస్తుంది
మట్టి పాత్రలను వాడటం
అంటే కేవలం ప్రకృతిని
ప్రేమించడం కాదు మన
సంస్కృతిని ప్రజారోగ్యాన్ని
సహజ వనరుల సంరక్షణ
మానవ వనరుల వికాసం
శ్రమ జీవన సౌందర్యాన్ని
గౌరవించడం
నేషనల్ క్లేడే వారోత్సవాల
సందర్భంగా
ప్లాస్టిక్ ను వీడుదాం
మట్టిని ఆదరిద్దాం
శ్రమ నీ సృష్టి మట్టి
నీ అస్తిత్వం అని నిరూపించిన
కుమ్మరి వృత్తి ఆదరిద్దాం
మన దేశ సంస్కృతి వారసత్వం
నాగరికతను జగతికి చాటుదాం
ప్లాస్టిక్ ను వీడుదాం
మట్టిపాత్రలు ఆదరిద్దాం
చల్లని కుండ ఆరోగ్యానికి అండ
మట్టిని ప్రేమిద్దాం జీవాన్ని
గౌరవిద్దాం ప్లాస్టిక్ హటావో
మట్టిపాత్రలు బచావో
మట్టిని రక్షిద్దాం రేపటి
తరాన్ని దీవిద్దాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ కుమ్మర సంఘం 880/2014
కార్యవర్గ సభ్యులు
తెలంగాణ రాష్ట్ర కుమ్మర
ఆత్మగౌరవ భవన్ ట్రస్ట్
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
హైదరాబాద్
9440245771
🏠 Home