🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 29 Jul, 2026 | Page: 1

సంస్కార దీప్తి _ మాతృమూర్తి

(సమాజ శిల్పి అమ్మ)
జన్మనిచ్చేది అమ్మ
కుటుంబ నిర్మాత
అమ్మ తొలి పలుకు
నేర్పే గురువు అమ్మ
పిల్లలకు నడవడి
దిద్దే దైవం అమ్మ
పిల్లల హృదయాల్లో
నైతిక విలువలు సంస్కార
బీజాలు నాటేది అమ్మ
ఉత్తమ పౌరులుగా
మార్చేది అమ్మ
అమ్మ కోపంలోను
క్రమశిక్షణ నేర్పుతుంది
ప్రేమతో మంచి మార్గం
చూపుతుంది
కృషిని సహనాన్ని నరనరాన
నింపి సమాజానికి బలమైన
మానవ శక్తికి పునాది వేస్తుంది
ఇంటికి దీపం అమ్మే
జగతిని మార్చే శక్తి అమ్మే
అమ్మ చేతిలో పెరిగిన బిడ్డ
రేపటి సమాజ మార్పుకు
ప్రగతికి దిక్సూచి అవుతాడు
సంస్కారాల ముద్రవేసే శిల్పి
పిల్లల్లో మర్యాదలు ఉత్తమ
గుణానికి నడవడికకు
భీజం వేసిఉత్తమ సమాజ
స్థాపనకు ఉద్దీపన శక్తి అమ్మే
సభ్య సమాజానికి
మూల స్తంభం అమ్మ
తల్లులకు సందేశం
సాంకేతిక యుగంలో
క్యారియర్ సంపాదన
వేటలో పరుగులు
పెడుతున్న తల్లులారా
పిల్లలతో సరదాగా గడపండి
వారి మనసెరిగి మసులుకోండి
వారి బాధలు పంచుకోండి
వారిలో ధైర్య సాహసాలు
పాదుకొల్పండి
కష్ట సుఖాల్లో మాధుర్యాన్ని
మంచి మాటలతో వివరించండి
ఫోన్ల ప్రపంచంలో
పిల్లలను ఒంటరి చేయకండి
భందువులకు దూరంగా
పెంచకండి కలుపుగోలుతానన్ని
ఉగ్గుపాలతోరంగరించి పెంచండి
ఒంటరి జీవితానికి పిల్లలను
భలిచేయొద్దు కలిసి ఉంటే
బలం అదే మన బలగం అని
పిల్లలకు నేర్పాలి
బంధువులు బంధుత్వాల
పరిచయాలు పిల్లల్లో పెంచాలి
సన్నిహితుల సన్నిహితుల
పిల్లల మధ్య సౌహార్థత
సంఘీ భావాన్ని పెంచాలి
ఓం తల్లులార ?
యాంత్రిక జీవనంలో
పిల్లలకు సంస్కారాన్ని
నేర్పడం మరువకండి?
తల్లి పిల్లలతో గడిపే
సమయమే వారి భవిష్యత్తుకు
వరం అదే వారి భవిష్యత్తుకు
వారధి వారి ప్రగతికి సారధి
పోలీకత్వంలో మార్కుల వేటలో
మానవత్వాన్ని నేర్పడం మరువకు
డబ్బు సంపాదనలో నైతిక
విలువలను వదలకు
సహనం గౌరవం సానుభూతి
సహకారం సమన్వయం నేర్పించాలి
సమాజాన్ని ప్రేమించే ఉత్తమ
పౌరులుగా తీర్చిదిద్దాలి
అమ్మ లాలి పాటలో ఉంది
సమాజ హితం
అమ్మ ఇచ్చే ధైర్యంలోనే ఉంది
దేశ ప్రగతి పురోగతి
నేటి తల్లే రేపటి సమాజ
నిర్మాత అన్న సామాజిక
బాధ్యత మరవద్దు
అమ్మే జగతిని నడిపించే పవిత్ర
విధాత మెరుగైన సమాజ రూప
శిల్పి "అమ్మేరా దైవం అమ్మను
గౌరవిద్దాం" భారత మాత కీర్తిని
జగతిన చాటుదాం.
(నేటి సమాజాన్ని తీర్చిదిద్దడంలో
పిల్లలకు సంస్కారాన్ని నేర్పడంలో
తల్లిదే ( అమ్మధే)ప్రధాన పాత్ర అనే అంశం పై స్పందిస్తూ రాసిన కవిత)
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
కాలమిస్ట్
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
కరీంనగర్9440245771
🏠 Home