తుంగతుర్తి ఎమ్మెల్యే శ్రీ మందుల సామేలు గారికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు – ఎస్సీ & ఎస్టి ఎమ్మెల్యే లకు మంత్రి పదవి ఇవ్వాలి.
దేవరకొండ 29జూలై (BVK 3 న్యూస్ ) : తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ మందుల సామేలు సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి మరియు రాజ్యాంగ విలువల పరిరక్షణకు అనుకూలంగా తీసుకుంటున్న వైఖరికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము.
ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రజాప్రతినిధికి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు ఉంది. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలు కాకుండా ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరగాలని ఎమ్మార్పీఎస్ గట్టిగా కోరుతోంది.
ఎస్సీ వర్గీకరణ, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జరిగే ప్రతి న్యాయమైన పోరాటానికి ఎమ్మార్పీఎస్ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ప్రజా సంక్షేమం కోసం పరితపించే నిజమైన ప్రజాప్రతినిధులకు మా సంఘం సర్వవేళలా మద్దతు అందిస్తుంది.