🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 30 Jul, 2026 | Page: 1

అమెజాన్ ప్రైమ్‌లోకి ‘పోలీస్ కంప్లైంట్’..

థియేటర్లలో తనదైన మార్కుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైవిధ్యమైన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత బాలకృష్ణ మహారాణా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. గత జూన్ నెలలో తెలుగు మరియు కన్నడ భాషల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. IMDb వంటి ప్రముఖ సినీ రేటింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు డిజిటల్ మీడియాలోనూ సంచలన రేటింగ్‌లు, సానుకూల సమీక్షలు అందుకని ఐకానిక్ హిట్ సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఈ శుక్రవారం అంటే జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో తెలుగు మరియు కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హారర్, మిస్టరీ, థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ యొక్క అద్భుత సమ్మేళనంగా తెరకెక్కింది. ముఖ్యంగా నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన నటనా ప్రయాణంలోనే మొదటిసారిగా పూర్తిస్థాయి వినోదాత్మక (ఎంటర్‌టైన్‌మెంట్) పాత్రలో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె తనదైన నటనతో అలరించగా, నటుడు నవీన్ చంద్ర తన విలక్షణమైన యాక్టింగ్‌తో కథకు బలాన్ని చేకూర్చి ప్రేక్షకులను కట్టిపడేసారు.
🏠 Home