🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 20 Aug, 2026 | Page: 1

వ‌ర్షం కారణంగా షూటింగ్ రద్దు.. తల్లిదండ్రుల మధ్య సేద తీరిన‌ విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కుటుంబంతో గడిపిన మధురమైన క్షణాలకు సంబంధించిన ఒక క్యూట్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షాల కారణంగా విజయ్ తాజా సినిమా షూటింగ్ అనూహ్యంగా రద్దు కాగా, ఆ సమయాన్ని ఆయన పూర్తిగా తన కుటుంబంతో కలిసి విశ్రాంతిగా గడపాలని నిర్ణయించుకున్నారు. చిన్నతనంలో తాను ఎంతో ఇష్టపడే ప్రదేశంలో, తన తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రపోతున్న ఒక అరుదైన ఫోటోను ఆయన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
🏠 Home