🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 21 Aug, 2026 | Page: 1

క్యాన్సర్‌ను నయం చేసే ఏఐ..

క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వణికిపోతాం. తెలిసిన వాళ్లు దాని బారినపడినా తట్టుకోలేం. ఒక్కసారి ఈ రోగం వస్తే నిత్యం దానితో పోరాడాలి. అయితే వచ్చే పదేళ్లలో క్యాన్సర్‌ను క్యూర్ చేయడానికి ఏఐ రంగంలోకి దిగబోతోందనే మాట గట్టిగా వినిపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ ఎలాంటి క్యాన్సర్‌నైనా సమూలంగా నయం చేయగలదనే చర్చ టెక్ వర్గాల్లో సాగుతోంది.స్కిన్ క్యాన్సర్‌ కణాలను అంతమొందించే వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి రిసెర్చర్స్‌కు ఏఐ సహకరించిందనే వార్తలు కూడా ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇప్పుడు కేవలం వ్యాక్సిన్ తయారీలో సహాయం చేసిన ఏఐ 5 నుంచి 10 సంవత్సరాల్లో క్యాన్సర్‌ను క్యూర్ కూడా చేస్తుందని ఏఐ రిసెర్చర్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో కొంత నిజం లేకపోలేదు. ఈ క్రమంలో త్వరలో ఏఐ అన్ని జబ్బులనూ నయం చేస్తుందని, క్యాన్సర్‌ను క్యూర్ చేసే సామర్థ్యం సంపాదిస్తుందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ వివరిస్తున్నారు. ప్రతి జబ్బుకీ ఏఐ మందు కనిపెట్టితీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
🏠 Home