🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 22 Aug, 2026 | Page: 1

‘కాక’తో కేక పుట్టిస్తున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమాను ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లో కొనసాగుతోంది. చిరంజీవిని సరికొత్త లుక్‌లో చూపించడంతో పాటు కథలో యాక్షన్, భావోద్వేగ అంశాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మెగాస్టార్‌ను తెరపై మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో చూడబోతున్నామనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.తాజాగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఇందులో చిరంజీవి ఆక్వా వ్యాపారిగా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా కనిపించే పాత్రకు భిన్నంగా మెగాస్టార్‌ను సరికొత్త మేనరిజమ్స్‌తో చూపించినట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. సినిమాలో భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఈ సీక్వెన్స్‌ను ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇక ఈ సినిమాకు ‘కాక’ అనే పేరు కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే చిరంజీవి పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో మెగాస్టార్ కనిపించిన తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్‌ను, యాక్షన్‌ను భారీ స్థాయిలో జోడించినట్లు తెలుస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
🏠 Home