అలాస్కాలో కూలిన విమానం..
అమెరికాలోని అలాస్కాలో విమాన ప్రమాదం జరిగింది. యాంకరేజ్ నుంచి సెల్డోవియా వెళ్తున్న చిన్న విమానం నీటిలో కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ మృతి చెందారు. బుధవారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా బయటపడలేదు.పైపర్ పీఏ-24 విమానం బుధవారం యాంకరేజ్‌లోని మెరిల్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి సెల్డోవియా వైపు పయనమైంది. సెల్డోవియా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలోపే విమానం అదుపు తప్పి సెల్డోవియా స్లఫ్ లోని నీటిలో కూలిపోయింది. ప్రమాదం తర్వాత విమానం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. సుమారు 15 అడుగుల లోతులో విమానం ఉన్నట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డుఅలాస్కా ప్రాంతీయ అధికారి క్లింట్ జాన్సన్ తెలిపారు