🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 31 Aug, 2026 | Page: 1

200 కోట్ల దిశగా దూసుకెళ్తున్న మాస్ మహారాజా సినిమా!

మాస్ మహారాజా రవితేజకు మరో బ్లాక్‌బస్టర్ హిట్ దక్కింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి దూసుకెళ్తోంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనతో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తూ మరో భారీ మైలురాయిని అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌కు తాజా టికెట్ సేల్స్‌నే నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్ బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ ద్వారా ఇప్పటివరకు ఈ సినిమా 70 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.కొత్త సినిమాలను ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ చేయడంఒక ప్రాంతీయ సినిమా ఈ స్థాయిలో టికెట్లను విక్రయించడం అరుదైన విషయంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదలై రోజులు గడుస్తున్నా టికెట్ డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం ‘ఇరుముడి’కి ఉన్న మౌత్ టాక్‌ను తెలియజేస్తోంది. రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న ‘ఇరుముడి’ ఇప్పుడు రూ.200 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్, థియేటర్లలో కొనసాగుతున్న ఆక్యుపెన్సీ, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌ను పరిశీలిస్తే ఈ మైలురాయిని కూడా సినిమా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.సాధారణంగా విడుదలైన మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో సినిమాల వసూళ్ల వేగం తగ్గుతుంది. అయితే ‘ఇరుముడి’ విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వీకెండ్‌లో ప్రేక్షకుల స్పందన మరింత పెరగడం, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువత కూడా థియేటర్లకు క్యూ కట్టడం సినిమాకు కలిసొస్తోంది.
🏠 Home