🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 09 Sep, 2026 | Page: 1

ఆన్‌లైన్‌లో ఆండ్రాయిడ్ డివైజ్ కోసం ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేయగానే షాక్..!

ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మోసపోతూనే ఉంటారు. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆండ్రాయిడ్ డివైజ్ కొనుగోలు చేశాడు. తీరా పార్సిల్ చేతికి అందిన తర్వాత కవర్ విప్పి చూసి.. షాక్ అయ్యాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. గ్రేటర్ నోయిడాలోని దంకోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకాష్ ఇటీవల ఆన్‌లైన్‌లో రూ.1,999 నగదు చెల్లించి.. ఆండ్రాయిడ్ డివైజ్‌ను కొనుగోలు చేశాడు.
రెండు రోజుల తర్వాత అతడికి ఆ పరికరం పార్సిల్ అందింది. ఆ పార్సిల్ విప్పి చూసి.. అతడు షాక్‌కు గురయ్యాడు. ఆ కవర్‌లో ఎండిన ఆవు పేడను గుర్తించాడు. దీంతో ఆందోళనకు గురైన అతడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
🏠 Home