వెజ్, నాన్ వెజ్ ఆహారాల్లో ఉండే ఐరన్ భిన్నంగా ఉంటుందని తెలుసా..?
శరీరంలో హిమోగ్లోబిన్ తయారవ్వడానికి ఐరన్ ఎంతో అవసరమైన పోషకం. శరీరానికి తగినంత ఐరన్ అందకపోయినా, అందిన ఐరన్ సరిగ్గా శోషించకపోయినా ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. దీంతో తరచూ అలసట, నీరసం, తల తిరగడం, శారీరక శ్రమ చేసినప్పుడు త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్కువ ఖర్చుతో ఐరన్ అందించే ఆహారాల కోసం చూస్తున్నవారికి మునగ ఆకులు, మసూర్ పప్పు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మాత్రమే సరిపోదు. అందులోని ఐరన్‌ను శరీరం ఎంతమేర శోషించుకుంటుందనేది కూడా ముఖ్యమే. మొక్కల ఆధారిత ఆహారాల్లో ప్రధానంగా నాన్-హీమ్ ఐరన్ ఉంటుంది. ఇది మాంసాహార ఆహారాల్లో లభించే హీమ్ ఐరన్‌తో పోలిస్తే శరీరంలో తక్కువగా శోషణకు గురవుతుంది. అందుకే కేవలం ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో ఐరన్ స్థాయిలు తప్పనిసరిగా పెరుగుతాయని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. మునగ ఆకులు, మసూర్ పప్పు వంటి చవకైన ఆహారాలు ఐరన్‌ను అందించగలిగినా, వాటిని సరైన ఆహారాలతో కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది.
విటమిన్ సి ముఖ్యం..
నాన్-హీమ్ ఐరన్ శోషణను మెరుగుపరచడానికి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను ఐరన్ ఉన్న పదార్థాలతో కలిపి తీసుకోవడం సులభమైన మార్గాల్లో ఒకటి. నిమ్మకాయ, ఉసిరికాయ, జామపండు, నారింజ, టమాటా వంటి వాటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఉదాహరణకు మసూర్ పప్పు లేదా మునగ ఆకులతో చేసిన వంటకంలో కొద్దిగా నిమ్మరసం కలపడం, లేదా ఆహారంతో పాటు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా ఐరన్ శోషణకు సహాయపడతాయి. అయితే ఐరన్ అధికంగా ఉండే భోజనంతోపాటు టీ లేదా కాఫీ తీసుకోవడం మాత్రం తగ్గించాలి. టీ, కాఫీలో ఉండే కొన్ని సమ్మేళనాలు ముఖ్యంగా మొక్కల నుంచి లభించే నాన్-హీమ్ ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ఐరన్ ఉన్న ప్రధాన భోజనానికి దగ్గరగా టీ, కాఫీ తాగకుండా ఉండటం మంచిది. రక్తకణాల ఆరోగ్యానికి ఐరన్ ఒక్కటే సరిపోదు. శరీరానికి తగినంత ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా అవసరం. ముఖ్యంగా ఎర్ర రక్తకణాల తయారీ, వాటి పనితీరు సక్రమంగా ఉండేందుకు వివిధ రకాల పోషకాలు అవసరమవుతాయి. అందువల్ల పప్పులు, కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, పాలు లేదా ఇతర అనుకూలమైన ప్రోటీన్ వనరులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.
మునగ ఆకులు, మసూర్ పప్పు..
మునగ ఆకులు, మసూర్ పప్పు వంటి ఆహారాలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఐరన్‌ను అందించడంలో సహాయపడతాయి. అయితే ఇప్పటికే రక్తహీనత ఉన్నవారు వీటినే చికిత్సగా భావించకూడదు. ఐరన్ లోపానికి ఆహారంలో ఐరన్ తక్కువగా ఉండటం ఒక్కటే కారణం కాదు. శరీరం ఐరన్‌ను సరిగ్గా శోషించుకోకపోవడం లేదా ఎక్కడైనా రక్తస్రావం జరగడం వంటి ఇతర కారణాల వల్ల కూడా ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఐరన్ లోపం పదేపదే రావడం లేదా కారణం తెలియకుండా కొనసాగడం కనిపిస్తే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. గ్యాస్ట్రైటిస్, సీలియాక్ వ్యాధి, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, పెప్టిక్ అల్సర్ లేదా జీర్ణవ్యవస్థలో దీర్ఘకాలిక రక్తస్రావం వంటి సమస్యలు ఐరన్ లోపానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రక్తంలో ఐరన్ స్థాయిలు తరచూ తగ్గుతున్నప్పుడు కేవలం ఐరన్ ఉన్న ఆహారం తినడం మీదే ఆధారపడకుండా అసలు కారణాన్ని గుర్తించడం అవసరం. ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందించి రక్తహీనత నుంచి కోలుకునే ప్రక్రియకు సహాయపడుతుంది. అయితే తీవ్రమైన లేదా ఇప్పటికే నిర్ధారణ అయిన రక్తహీనత ఉన్నప్పుడు ఆహారంలో మార్పులు చేయడం మాత్రమే సరిపోదు. హిమోగ్లోబిన్ లేదా ఫెరిటిన్ స్థాయిలు గణనీయంగా తగ్గిన సందర్భాల్లో ఐరన్ సప్లిమెంట్లు అవసరమయ్యే అవకాశం ఉంది. రక్త పరీక్షల ఫలితాలు, ఐరన్ లోపం తీవ్రత, దానికి కారణం, వ్యక్తి మొత్తం ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స నిర్ణయించాలి. అందువల్ల వైద్యుల సలహా లేకుండా ఐరన్ సప్లిమెంట్లను స్వయంగా తీసుకోవడం మంచిది కాదు.