🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 11 Sep, 2026 | Page: 1

రాత్రిపూటనే దోమలు ఎందుకు యాక్టివ్‌గా ఉంటాయి?

పగటిపూట గదిలో అక్కడక్కడా కనిపించే దోమలు.. రాత్రి అయ్యేసరికి ఒక్కసారిగా ఎక్కువైనట్లు అనిపిస్తాయి. అయితే రాత్రివేళల్లో దోమలు ఎక్కువగా చురుగ్గా ఉండటానికి చీకటి, వాతావరణ పరిస్థితులు కారణమవుతాయి. పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటంతో కొన్ని రకాల దోమలు చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడంతో అవి మరింత చురుగ్గా మారే అవకాశం ఉంటుంది.అంతేకాదు.. దోమలు మన శరీరం నుంచి వెలువడే వేడిని కూడా గుర్తించగలవు. మనం నిద్రిస్తున్నప్పుడు శరీరం నుంచి వెలువడే వేడి, శ్వాస ద్వారా బయటకు వచ్చే కార్బన్ డయాక్సైడ్ వంటి సంకేతాలు దోమలను మనవైపు ఆకర్షించవచ్చు. అందుకే నిద్రపోతున్నప్పుడు దోమలు మన చుట్టూ తిరుగుతూ కనిపిస్తాయి.
🏠 Home