🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 12 Sep, 2026 | Page: 1

‘రోబో’ రీరిలీజ్‌పై పెరుగుతున్న డిమాండ్..

భారతీయ సినిమా చరిత్రలో సాంకేతికంగా, విజువల్‌గా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’కు ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లోనే ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. రజినీకాంత్ స్టార్‌డమ్, శంకర్ విజన్, భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక సాంకేతికత.. ఇవన్నీ కలసి ‘రోబో’ను ఒక ఎపిక్ మూవీగా నిలబెట్టాయి. విడుదలై ఇన్నేళ్లు గడిచినా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ‘రోబో’ను మరోసారి థియేటర్లలో చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ డిమాండ్ మరింత పెరగడం ఆసక్తికరంగా మారింది.
గత కొద్ది రోజులుగా ‘రోబో’లోని పలు యాక్షన్ సన్నివేశాలు, అప్పట్లోనే చూపించిన ఆధునిక సాంకేతిక అంశాలకు సంబంధించిన క్లిప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదలైన సమయంలోనే ఇంత అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్‌ను శంకర్ ఎలా ఊహించగలిగారంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, రోబో పాత్రకు సంబంధించిన సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌ను అభిమానులు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. దీంతో ‘రోబో’ను థియేటర్లలో మళ్లీ విడుదల చేయాలనే డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే అభిమానుల కోరిక కేవలం రీరిలీజ్‌తో ఆగడం లేదు. ఇంతటి భారీ విజువల్ వండర్‌ను కేవలం సాధారణంగా లేదా 4కే రూపంలో మాత్రమే కాకుండా.. అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రీమియం ఫార్మాట్లలో గ్రాండ్‌గా రీరిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
🏠 Home