పహల్గాం దాడిని ఖండిస్తున్నాం..
ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించమని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించమని బ్రిక్స్ దేశాధినేతలు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించిన వీరు.. అన్ని రకాల ఉగ్రవాద చర్యలను క్రిమినల్, సహేతుకంకాని నేరంగా పరిగణించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రకటన చేశారు.భారత్ వేదికగా జరుగుతున్న పద్దెనిమిదో బ్రిక్స్ సమావేశంలో ఉగ్రవాదంపై పిడికిలి బిగించారు నేతలు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిక్స్ నాయకులు.. అన్ని రకాల టెర్రరిజంపై పోరాటానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. 140 పాయింట్లతో న్యూ ఢిల్లీ డిక్లరేషన్ విడుదల చేసిన వీరు.. ఉగ్రవాదాన్ని క్రిమినల్, న్యాయసమ్మతం కాని చర్యగా పరిగణించాలని తీర్మానించారు.