హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకపై దాడి..
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన జలసంధి పరిధిలోని క్వెష్మ్ ఐలాండ్ సమీపంలో ఆదివారం జరిగింది. క్వెష్మ్, హెంగామ్ ఐలాండ్ తీరంలో ఉదయం ఐదు గంటల సమయంలో ఈ దాడి జరిగిందని ఇరాన్ మీడియా వెల్లడించింది.
బ్రిటన్‌కు చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కూడా ఈ విషయాన్ని నిర్ధరించింది. ఇరాన్ వాణిజ్య నౌకపై ఒక వస్తువుతో దాడి జరిగిందని ఈ సంస్థ తెలిపింది. అయితే, పూర్తి వివరాల్ని వెల్లడించలేదు. అమెరికా సైన్యం కూడా ఈ దాడిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇరాన్ వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికా దాడులు నిర్వహిస్తోంది. హార్ముజ్ జలసంధిని అధీనంలో ఉంచుకోవడం, ఇరాన్ పోర్టుల్ని అడ్డుకోవడం వంటి చర్యల్లో భాగంగా ఇరాన్ ఈ పని చేస్తోంది. శనివారం రాత్రి హార్ముజ్ జలసంధిలోని క్వెష్మ్ ఐలాండ్‌లో అనేక దాడులు, పేలుళ్లు జరిగినట్లు సమాచారం. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది.