🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 15 Sep, 2026 | Page: 1

బాక్సాఫీస్‌ వద్ద ‘మండాడి’ మేనియా.. 5 రోజుల్లో రూ.65 కోట్లు..

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘మండాడి’ (Mandadi) బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో టాలెంటెడ్ డైరెక్టర్ మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ చిత్రం, విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. బోట్ రేసింగ్ నేపథ్యంతో సాగే వినూత్న కథాంశం, అద్భుతమైన యాక్షన్‌ ఘట్టాలు ప్రేక్షకులను థ్రియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయి.అయితే ఈ సినిమా కమర్షియల్ విజయంతో పాటు, దీని డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.45 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే, ఈ డీల్ వెనుక ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ లింక్ ఒప్పందం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట నిర్మాత ఎల్రెడ్ కుమార్ రూ.25 కోట్లు డిమాండ్ చేయగా, నెట్‌ఫ్లిక్స్ రూ.15 కోట్లు మాత్రమే ఇవ్వడానికి ముందుకొచ్చింది.
🏠 Home