🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 16 Sep, 2026 | Page: 1

‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోయిన్‌గా ‘రోమాంచ‌కం’ బ్యూటీ?

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘ఎల్లమ్మ’సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంలో, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రంలో హీరోయిన్‌గా యువ నటి అనంతిక సనిల్‌కుమార్న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు సమాచారం.‘బలగం’ వంటి ఎమోషనల్ అండ్ సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాయిక పాత్రకు తగినట్టుగా అనంతిక సనిల్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
🏠 Home