🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 22 Sep, 2026 | Page: 1

ఆఫ్గనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఇండియా..

ఆఫ్గ‌నిస్తాన్‌పై పాకిస్తాన్ జ‌రుపుతున్న దాడుల్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఇది పాకిస్తాన్ ఆధిప‌త్య‌, ఆక్ర‌మ‌ణ ధోర‌ణికి నిద‌ర్శ‌న‌మ‌ని ఇండియా వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ ప్ర‌తినిధి ర‌ణ‌ధీర్ జైశ్వాల్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌లి కాలంలో ఆఫ్గ‌నిస్తాన్‌పై పాకిస్తాన్ వ‌రుస దాడుల‌కు దిగుతోంది. గ‌త వారం కూడా ఆఫ్గ‌నిస్తాన్‌పై వైమానిక దాడుల‌కు దిగింది.ఆఫ్గ‌న్‌లోని కునార్, ప‌క్తిక ప్రావిన్స్‌ల‌లో పాక్ వైమానిక దాడుల‌కు దిగింది. ఈ ఘ‌ట‌న‌ల్లో ప‌లువురు పౌరులు మ‌ర‌ణించారు. మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. తీవ్ర ఆస్తి న‌ష్టం జ‌రిగింది. యుద్ధ నీతికి వ్య‌తిరేకంగా సాధార‌ణ పౌరుల‌ను, నిర్మాణాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వైమానిక దాడుల‌కు దిగుతోంది. పాక్ జ‌రుపుతున్న ఈ దాడుల‌పై ఇండియా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ర‌ణ‌ధీర్ జైశ్వాల్ స్పందిస్తూ పాక్ దాడుల్లో మ‌ర‌ణించిన ఆఫ్గ‌న్ పౌరుల‌కు సంతాపం తెలిపారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. పొరుగుదేశ సార్వ‌భౌమ‌త్వంపై పాక్ దాడి చేస్తోంద‌ని జైశ్వాల్ విమ‌ర్శించారు.
🏠 Home