🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 22 Sep, 2026 | Page: 1

సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారిణి వర్షితకు రూ.10,500 ఆర్థిక సాయం

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన పోతిరెడ్డి వర్షితకు ఆర్థిక ఇబ్బందులపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి స్పందనగా దాత‌లు రూ.10,500 ఆర్థిక సహాయం అందించారు. రామవరం మాతా శిశు ఆస్పత్రి డాక్టర్‌ మామిడాల సుజాత రూ.5,000, జడ్పీహెచ్‌ఎస్‌ 1995-96 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు రూ.3,500, పాఠశాల ఉపాధ్యాయులు రూ.2,000 కలిపి మొత్తం రూ.10,500ను వర్షితకు అందజేశారు. మహారాష్ట్రలో ఈ నెల 27 నుండి 30 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వర్షితకు చేయూతనందించిన దాతలకు, బిజెపి నాయకుడు సొప్పరి క్రాంతికి, క్రీడాకారిణి వర్షిత, కోచ్‌ పొన్నాల పృథ్వీరాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. వర్షితకు ఆర్థిక సహాయం అందేలా కథనాన్ని ప్రచురించిన నమస్తే తెలంగాణకు కూడా వారు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయిలో వర్షిత ప్రతిభ కనబరచి మంచి ఫలితాలు సాధించాలని అంతా ఆకాంక్షించారు.
🏠 Home